తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ విద్యా దినోత్సవ సందర్భంగా కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో సత్తుపల్లి శాసనసభ్యులు వెంకట వీర గారు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు.
మన ఊరు మనబడి కార్యక్రమంలో అభివృద్ధి పరిచిన తరగతి గదులను ప్రారంభించి, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను నోట్బుక్కులను యూనిఫామ్ దుస్తులను పంపిణీ చేసి, విద్యా దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విద్యార్థులకు ఉదయం పూట రాగి జావా అదించారు.
ఈ కార్యక్రమంలో అత్మ ఛైర్మన్ వనమా వాసు గారు, జడ్పిటిసి కట్ట అజయ్ కుమార్ గారు, ఎంపీపీ బీరవల్లి రఘు గారు, మండల యువజన విభాగం అధ్యక్షులు పెడకంటి రామకృష్ణ, కో ఆప్షన్ ఇస్మాయిల్, మండల పార్టీ కార్యదర్శి కోరకొప్ప ప్రసాద్, సొసైటీ అధ్యక్షులు కీసర వెంకటేశ్వరరెడ్డి, గోల్లమందల రవికాంత్, మండల నాయకులు లక్కినేని రఘు , మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పసుమర్తి చంద్రరావు, కమిలి, సూర్యనారాయణ తదితులున్నారు.