తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యదినోత్సవం కార్యక్రమాన్ని గౌరవనీయులు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు భారత రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపినాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ జవహర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపినాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా పేద విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకాన్ని విదేశీ విద్య కోసం తీసుకువచ్చారని, తెలంగాణ ప్రభుత్వం 7200 కోట్ల రూపాయలు మన ఊరు మన బడి కార్యక్రమానికి కేటాయించడం జరిగిందని అన్నారు.
ఎమ్మెల్యే నిధుల నుండి ప్రతి సవంత్సరం 2 కోట్ల రూపాయలు సర్కారు బడుల్లో మౌలిఖ వసతుల కల్పనకు మన ఊరు మన బడి కార్యక్రమానికి తీసుకువచ్చి వాటి రూపురేఖల్ని మార్చడం జరిగిందని అన్నారు , జవహర్ ప్రభుత్వ పాఠశాలకు 50 లక్షల రూపాయలు మంజూరు చెయ్యడం జరిగిందని, ఈ పాఠశాలలో లో 92 పరిసెంట్ ఉతీర్ణత సాధించడం చాల గొప్ప విషయం అని అన్నారు, దేశంలోకెల్లా అత్యధిక గురుకుల విద్యాలయాలు కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు.