Home / SLIDER / విద్యా, వైద్య రంగాలకు బిఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట

విద్యా, వైద్య రంగాలకు బిఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యా దినోత్సవం సందర్భంగా మంగళవారం కోనరావుపేట మండలంలోని కనగర్తి గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో నిర్మించిన క్లాస్ రూమ్ లు, కిచెన్ షేడ్ లను ప్రారంభించి, విద్యార్థులకు రాగి జావా ను అందించిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి గారు.అనంతరం మండల కేంద్రము లో గ్రంధాలయాన్ని ప్రారంభించి, మోడల్ స్కూల్ లో విద్యార్థులకు బుక్స్, యూనిఫాములు అందజేసినారు.ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ గారు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన కొరకు మన ఊరు మన బడి అనే బృహత్తర కార్యక్రమాన్ని తీసుకువచ్చారు.

రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కొసం 7300 కోట్లను మంజూరీ చేశారన్నారు. మన జిల్లాల్లో మొదటి విడతలో భాగంగా 172 ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. కొనరవుపెట్ మండలం లో మొదటి విడతలో భాగంగా 16 పాఠశాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. మొదటి విడతలో సుమారుగా 4కోట్ల 70 లక్షలతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను కల్పించడం జరిగిందన్నారు. దీని ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, అదనపు తరగతి గదులు, కాంపౌండ్ వాల్స్, కిచెన్ షేడ్స్ నిర్మాణం చేయడం జరిగిందన్నారు. అలాగే ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉన్నట్టే, అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరుగుతుంది.

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు పౌష్టికాహారం అందెలనే ఉద్దేశ్యంతో రాగి జావ ను అందించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు సన్న బియ్యంతో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందన్నారు.మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక రూపకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నయాన్నరు. ఆసరా పెన్షన్లు, పేదింటి ఆడపిల్లల పెల్లిలకు కళ్యాణ లక్ష్మి, షాదిముబరాక్ ద్వారా ఒక లక్ష రూపాయలను అందివ్వడం జరుగుతుందన్నారు. కెసిఆర్ కిట్, రైతు బంధు, రైతు భీమా, దళిత బంధు, కాళేశ్వరంప్రాజెక్ట్ ద్వారా పంట పొలాలకు సాగు నీరు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అమ్మ ఒడి, ఆరోగ్య లక్ష్మి, 24 గంటల కరెంటు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత డయాలసిస్ కేంద్రాలు, మహిళల రక్షణ కొరకు షి టీమ్స్, పల్లె ప్రగతి, హరితహారం, అన్ని గ్రామాల్లో వైకుంఠ దామాలు, డంప్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీ లు ఇంకా చెప్పుకుంటూ పోతే మన కెసిఆర్ గారు తెలంగాణ ప్రజల కోసం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకాలు ఎన్నో ఉన్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat