పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పాఠశాలలను ప్రభుత్వం బలోపేతం చేస్తుందని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. ఆదివారం కోదాడ మండలం చిమిర్యాల గ్రామంలో రూ.15.26 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ప్రారంభించారు. ముందుగా పాఠశాలలోనే సరస్వతి మాతాకీ పూలమాల వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ……. గత పాలకవర్గాల నిర్లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలు పోయాయన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా రంగ రక్షణకు శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి పేద మధ్య తరగతి వర్గాల పిల్లలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తుందన్నారు అని ఆయన తెలిపారు. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు మన ఊరు మన బడి పథకం తో ఈ ఏడాది నుండి ఇంగ్లీష్ మీడియాం విద్యతో పాటు మౌలిక సదుపాయాలు అదనపు తరగతి గదులు, మంచినీటి సౌకర్యం, విద్యుత్తు మూత్రశాలలు, మరుగుదొడ్లు, కిచేన్ షెడ్లు, డైనింగ్ హాల్లు, ప్రహరీ గోడలు, డిజిటల్ క్లాస్ రూమ్స్ ల ఏర్పాటుకోసం లక్షల బడ్జెట్ను పాఠశాల విద్యా కమిటీ ఖాతాల్లో జమ చేసింది అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య తో పాటు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం వారానికి మూడు కోడి గుడ్లు ఉచితంగా పుస్తకాలు దుస్తులు అందజేస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులకు ఎమ్మెల్యే గారు స్కూల్ యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపి కవిత రాధారెడ్డి, జెడ్పిటిసి కృష్ణకుమారి శేషు,, ఎంఈఓ సలీం షరీఫ్, ఎంపీడీవో విజయ్ శ్రీ, సర్పంచ్ కొండ శైలజ, ఎంపీటీసీ సౌజన్య బాలకృష్ణ, క్రాంతి కుమార్, గ్రామ పెద్దలు కొత్త బ్రహ్మయ్య, మురళీకృష్ణ, రావూరి రవీంద్ర, మాజీ సర్పంచ్ ఆదినారాయణ, ప్రధానోపాధ్యాయులు కమలాకర్, విద్యా కమిటీ చైర్మన్ కలకొండ స్వాతి గురు ప్రసాద్, టిఆర్ఎస్ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.