కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గార్డెన్ కాలనీ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని సభ్యులు తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.
కాలనీలో ఎటువంటి సమస్యలన్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఉప్పల హరివేణు గోపాల్, వైస్ ప్రెసిడెంట్లు శ్రీరామ్, శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.