Home / SLIDER / తండాలను పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ గారిదే

తండాలను పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ గారిదే

సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మండలం, ఓబుల్ రావు బంజార లో గిరిజన దినోత్సవ వేడుకలు ఎమ్మేల్యే సండ్ర వెంకట వీరయ్య గారు ముఖ్యఅతిథిగా పాల్గొనగా ఘనంగా నిర్వహించారు. ముందుగా మహిళలు, గ్రామస్తులు, బాలలు ఎమ్మేల్యే సండ్ర గారికి సాంప్రదాయ వస్త్ర దారణతో, బతుకమ్మలతో, కోలాట నృత్యాలతో, పూల జల్లులతో ఎదురెల్లి…. జయహో కేసీఆర్, జయహో కేటీఆర్, జయహో సండ్ర, జయ జయహో తెలంగాణ, బీఅర్ఎస్, అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో ఓరెత్తిస్తో సాదర స్వాగతం పలికారు.

బంజారా మహిళలు కాళ్ళకు గజ్జలు కట్టుకొని, ఆటపాటలతో ఊరంతా మామిడి తోరణాలతో కొబ్బరి ఆకులతో అలంకరించగా పండగలా గ్రామంలో ర్యాలీని ఘనంగా నిర్వహించారు. లంబాడీల ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ….
శతాబ్ద కాలంలో జరగని గిరిజనుల అభివృద్దినీ దశాబ్ది కాలంలో చేసి చూపించిన గొప్ప మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు అన్నారు. అందుకు నిలువెత్తు సాక్ష్యం తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడమే నని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజన సంక్షేమ దినోత్సవం వేడుకలను కల్లూరు మండలం ఓబులరావు బంజర్ గ్రామంలో బంజారా వాసుల సమక్షంలో బంజారా సంస్కృతిని తెలుపుతూ గిరిజన దినోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపు కోవడం సంతోషదాయకం అన్నారు.
ఎన్నో దశాబ్దాలుగా అణచివేతకు, ఆర్థికంగా వెనుకబాటుకు గురైన గిరిజనులు, ఆదివాసీలను ఇతర సామాజిక వర్గాలతో సమానంగా ఎదిగేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందనీ, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలోనే తండాల్లో నవశకం వచ్చిందని అన్నారు. ఈ రోజు సమాజంలో గిరిజన తండాలు అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నాయని ఇంతటి అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ గారికి యావత్ గిరిజన సమాజం
బాసటగా నిలవాలని కాంక్షించారు.

కార్యక్రమంలో… ఆర్డీవో సిహెచ్ సూర్యనారాయణ, తహసిల్దార్ బాబ్జి ప్రసాద్, ఎంపీడీవో బి. రవికుమార్, AO రూపా ఇతర అధికారులు మరియు జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ కొత్తూరు ఉమా మహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు, ఎంపీపీ బీరవల్లి రఘు, జెడ్పిటిసి కట్టా అజయ్ కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాలెపు రామారావు, రై.స.స జిల్లా కమిటీ సభ్యులు పసుమర్తి చంద్రరావు మరియు సర్పంచ్ భూక్యా మాన్సింగ్, సర్పంచ్ లు రావి సూర్య నారాయణ, గంగవరపు శ్రీనివాసరావు,.బీఅర్ఎస్ మండల సెక్రెటరీ కొరకొప్పు ప్రసాద్, నాయకులు మేకల కృష్ణ, ఎంపిటిసి వైకంటి పద్మావతి హరిబాబు, బీఅర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు యరమల సత్యనారాయణ రెడ్డి, సరాబు వేంకటేశ్వర రావు, భూక్యా రామునాయక్, AMC.డైరెక్టర్ కట్టా అర్లప్ప, తడికమళ్ల శామెలు, కెళొత్ కృష్ణ నాయక్, మోదుగు వీరయ్య, మాజీ ఎంపీటీసీ భాణోత్ భద్యా, ఐలూరి నాగిరెడ్డి, మండల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, గిరిజన సంఘాల నాయకులు, గిరిజన మహిళలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat