యువత తమకున్న నైపుణ్యంతో ఉపాధిలో రాణిస్తూ మరికొందరికి ఉపాధి కల్పించాలని కోదాడ అభివృద్ధి ప్రధాత,శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో హుజూర్ నగర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ శివమ్ యూపీవీకి విండోస్, అండ్ డోర్స్ షాప్ ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. యువతకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని అన్నారు. కులవృత్తులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా నిధుల అందిస్తుందని తెలిపారు.
ప్రభుత్వం అందిస్తున్న చేయూతను సద్వినియోగం చేసుకొని యువత అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఇంపోజు రాజు, సైదాచారి, వెంకన్న, మునగాల మండల పార్టీ అధ్యక్షులు తొగర్రు.రమేష్, స్థానిక కౌన్సిలర్ జ్యోతి శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ ఆప్షన్ సభ్యులు డాక్టర్ బ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు..