తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం నేటితో 100 రోజులు పూర్తయిన సందర్భంగా 40 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపి …,దేశంలో వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం అయిన సంధర్బంగా రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్ గార్లు హైదరాబాదులోని డా. B R అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని రాష్ట్ర వైద్య& ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో కలసి పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్యదర్శి రిజ్వి, కార్యదర్శి శ్వేతా మహంతి, డైరెక్టర్ మెడికల్ & హెల్త్ గడల శ్రీనివాసరావు, వైద్య & ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.