తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ తన స్వరూపాన్ని మరోసారి మార్చుకోనున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. నేటి నుంచి సరికొత్త పాలన అందుబాటులోకి వస్తున్నదని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో వార్డు కార్యాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.
పౌర సమస్యల పరిష్కారంలో నగర వాసులకు మరింతగా చేరువయ్యేందుకు ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేసిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన వార్డు కార్యాలయాలు ప్రారంభమయ్యాయి.
కాచిగూడలో వార్డు కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వార్డు అధికారితోపాటు మొత్తంగా వార్డులో 10 మంది చొప్పున 150 వార్డులలో 1500 మంది అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండనున్నారు.\
దీంతో ప్రజా సమస్యలు అక్కడిక్కడే పరిష్కారం అవుతాయని చెప్పారు. సమస్యలు ఎంత సమయంలో పరిష్కారం చేయాలనే సిటిజన్ చార్టర్‌ను కూడా వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.