తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో హైదరాబాద్ కు చెందిన Futsal Sports 5గురు క్రీడాకారులు ఇబాదుల్లా ఖాన్, ఇబ్రహీం అలీ, షేక్ ఒమర్, జుబైర్ బిన్ సుల్తాన్, మొహమ్మద్ జవాధ్ హుస్సేన్ లు త్వరలో ఖతార్ లో జరగనున్న Asian Futsal Cup- 2023 లో పాల్గొనే ఇండియన్ నేషనల్ Futsal team కు ఎంపికైన సంధర్బంగా ఢిల్లీ లో జరగనున్న ప్రిపరేటరీ pre – camp కు వెళ్తున్న సందర్భంగా అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి వేదికలపై రాణించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తున్నారన్నారు.
ఖతార్ లో జరిగే ఏషియన్ Futsal కప్ కు ఎంపికైన క్రీడాకారులను అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్ వాసిఫ్ మక్తర్, మహబూబ్ నగర్ కౌన్సిలర్ మోసిన్, మైనారిటీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.