తమిళనాడులో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మంత్రి రోజాకు చికిత్స కొనసాగుతోంది. మరో 2 రోజులు ఆమె తమ అబ్జర్వేషన్ లో ఉంటారని వైద్యులు తెలిపారు.
అయితే మంత్రి రోజా కొంతకాలంగా వెన్నెముక, కాలు నొప్పితో బాధపడుతున్నారు. ఇటీవల సమస్య తీవ్రం కావడంతో ఇంటివద్దే ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు.
అయినా నొప్పి తగ్గకపోవడం, కాలు వాపు రావడంతో శుక్రవారం రాత్రి ఆమెను చెన్నైకి తరలించారు. ఇదే సమస్యతో ఇటీవల కేబినెట్ భేటీకి కూడా రోజా హాజరుకాలేదు.