బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్షిప్ లో ఉన్నట్లు మిల్కీ బ్యూటీ తమన్నా ఒప్పుకుంది. లస్ట్ స్టోరీస్-2 సెట్స్ లో తమ ప్రేమ కథ ప్రారంభమైందని వెల్లడించింది.
‘తోటి నటుడు అని విజయు ఇష్టపడలేదు. అతడు చాలా స్పెషల్. నాకు రక్షణగా నిలబడతాడనే నమ్మకం ఉంది. మా మధ్య మంచి బంధం ఉంది. నన్ను కిందకు లాగే వారి నుంచి రక్షిస్తాడు. నా పట్ల శ్రద్ధ వహిస్తాడు. తను ఉన్న చోటే నాకు సంతోషకరమైన ప్రదేశం’ అని చెప్పుకొచ్చింది.