ఉమ్మడి రాష్ట్రంలో పల్లెలకు, గూడలకు గ్రామాల్లోకి వెళ్ళడానికి సరిగా రోడ్లు కూడా ఉండక ఆరోజుల్లో ప్రజలు ఇబ్బందులు పడే రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత చిరకాల వాంఛలు అయిన రోడ్లు నిర్మించుకోవడంలో భాగంగా ఈరోజు నెరడిగొండ మండలంలోని కిష్టపూర్ గ్రామానికి మరియు శంకరపూర్ గ్రామానికి మరియు లింగట్ల గ్రామాలకి 2 కోట్ల 43 లక్షలతో ఐటిడిఎ ద్వారా అద్భుతమైన రోడ్ల నిర్మాణానికి గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు ముఖ్యఅతిథిగా హాజరయి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.
75 స్వాతంత్ర్య భారత దేశంలో ఇప్పటి వరకు ఇక్కడ బీటీ రోడ్లు మంజూరు కాలేవని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలోనే ఇలాంటి అద్భుతమైన రోడ్లను నిర్మించుకున్నామన్నారు.
అనంతరం నెరడిగొండ ఎంపిపి సజన్ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి నాయకుల మధ్య కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోథ్ అధికార ప్రతినిధి మొట్టే కిరణ్ కుమార్, జడ్పీటీసీ అనిల్ జాదవ్, ఎంపిపి సజన్, స్థానిక సర్పంచులు మండల నాయకులు పాల్గొన్నారు.