2007, 2011 వరల్డ్ కప్ లలో భారత్ సమిష్టిగా రాణించి గెలిస్తే.. కెప్టెన్ ధోనీని హీరోని చేశారని టీమిండియా మాజీ ఆటగాడు..ఎంపీ గౌతమ్ గంభీర్ విమర్శించారు.
ఐసీసీ ట్రోఫీల్లో గెలవడం మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కే సాధ్యమని సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై స్పందించిన గంభీర్.. ‘ICC టోర్నమెంట్లలో మనోళ్లు వ్యక్తిగత ప్రదర్శనలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
వేరే జట్లు సమష్టిగా ప్రదర్శన చేస్తాయి. 2007, 2011 WCలలో భారత్ గెలిచిందంటే యువరాజ్ సింగ్ ప్రధాన కారణం’ అని మాట్లాడారు.