తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన సొంత ఖర్చుతో బాల్కొండ మండలంలోని అన్ని గ్రామాల్లో మంగళవారం “తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 12వ రోజు “మహిళ సంక్షేమ దినోత్సవం” సందర్భంగా గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు,అలాగే అంగన్వాడి ఆయాలకు బాల్కొండ మండల కేంద్రంతో పాటు,కిసాన్ నగర్,వన్నెల్(బి),బోదేపల్లి,చిట్టాపూర్,శ్రీరాంపూర్,జలాల్పూర్,నాగపూర్,బస్సాపూర్,ఇత్వార్ పేట్ గ్రామాలకు చెందిన మహిళ పారిశుద్ధ్య కార్మికులకు,అంగన్వాడీ మహిళా ఆయాలకు ఈరోజు ప్రజాప్రతినిధులు,నాయకులు మంత్రి పంపిన చీరలు అందజేశారు.
బాల్కొండ మండల కేంద్రంలో సర్పంచి భూస సునీత,ఎంపీపీ లావణ్య-లింగాగౌడ్, ఉపసర్పంచి షేక్ వాహబ్,ఎంపీటీసీ సభ్యులు కన్న లింగవ్వ-పోశెట్టి,పంచాయతీ కార్యదర్శి రజినీకాంత్ రెడ్డి, వార్డు సభ్యులతో కలిసి వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సారధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని మహిళలను గౌరవించే విదంగా ఈరోజు “మహిళ సంక్షేమ దినోత్సవం ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని వారు తెలిపారు.బాల్కొండ మహిళల తరుపున చీరలు పంపించినందుకు మంత్రి ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో వార్డు సభ్యులు పుప్పాల లావణ్య-విద్యా సాగర్, బాద్గుణ రంజీత్ యాదవ్,వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వేంపల్లి చిన్న బాల్ రాజేశ్వర్,రైతు విభాగం మండల అధ్యక్షుడు,ధర్మాయి రాజేందర్,జూనియర్ అసిస్టెంట్ ప్రభాకర్,తదితరులు పాల్గొన్నారు