నిన్న ఆదివారం జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెల్సిందే. ఈ పరాజయం తర్వాత భారత జట్టుపై వస్తున్న విమర్శలపై ఆటగాళ్లు పరోక్షంగా స్పందించారు.
ఇందులో భాగంగా ‘నిశ్శబ్దం అనేది గొప్ప బలానికి మూలం’ అంటూ కింగ్ విరాట్ కోహ్లి ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. మరోవైపు యంగ్ క్రికెటర్ శుభమన్ గిల్ ‘నాట్ ఫినిష్డ్ (ఇంకా ముగిసిపోలేదు)’ అని ట్వీట్ చేశారు. కాగా, ఐపీఎల్ జట్టు ఆటగాళ్లను ప్రభావితం చేసిందని అభిమానులు కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.