ఐపీఎల్-2023లో టీమిండియా మాజీ కెప్టెన్.. కింగ్ విరాట్ కోహ్లితో జరిగిన వాగ్వాదం గురించి మాజీ ఆటగాడు.. ఎంపీ గౌతమ్ గంభీర్ తాజాగా స్పందించారు.
ఓ న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లితో నా అనుబంధం ఒకేలా ఉంటుంది. మా మధ్య వాగ్వాదం జరిగితే అది మైదానంలో మాత్రమే ఉంటుంది.
గ్రౌండ్ బయట కాదు. వ్యక్తిగతంగా మా మధ్య ఎలాంటి గొడవ లేదు. నాలాగే వాళ్లు కూడా మ్యాచ్లు గెలవాలని కోరుకుంటారు’ అని గంభీర్ చెప్పారు.