కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 15న తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఈనెల 15న ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో శ్రీసీతారాములవారిని దర్శించుకోనున్నారు. అనంతరం అదే రోజు ఖమ్మంలో జరిగే బహిరంగసభలోపాల్గొంటారు.
సభ అనంతరం పార్టీకి చెందిన పలువురు నేతలతో అమిత్ షా విడివిడిగా సమావేశం అవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. తర్వాత శంషాబాద్ చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.