WTC ఫైనల్ టెస్టులో చివరి రోజైన నేడు ఆదివారం 280 పరుగులు చేస్తే భారత్ విజేతగా నిలుస్తుంది. అయితే క్రీజులో ఉన్న విరాట్ కోహ్లిపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ అన్నారు.
‘విరాట్ కోహ్లి క్రీజులో ఉన్నంత సేపు భారత్ గెలిచే అవకాశం ఉంది. గొప్ప ప్లేయర్లు అద్భుతాలు చేయగలరు. కోహ్లి ఔటయ్యే వరకు ఆస్ట్రేలియా రిలాక్స్ అవ్వొద్దు’ అని జస్టిన్ లాంగర్ సూచించారు.