మెగా హీరో వరుణ్ తేజ్, అందాల రాక్షసి… హీరోయిన్ లావణ్య త్రిపాఠిల పెళ్లి ఇటలీలో జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మిస్టర్ సినిమా షూటింగ్ ఇటలీలో జరిగేటప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు సమాచారం.
దీంతో అక్కడే మ్యారేజ్ ఫిక్స్ చేసినట్లు టాక్. ప్రైవేట్ రిసార్ట్ కోసం వెతుకుతున్నారట. త్వరలో పెళ్లి తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, వీరి నిశ్చితార్థం హైదరాబాద్ లోని హీరో నాగబాబు నివాసంలో జరిగింది.