Home / SLIDER / హెల్త్‌ హబ్‌గా తెలంగాణ  

హెల్త్‌ హబ్‌గా తెలంగాణ  

తెలంగాణ   హెల్త్‌ హబ్‌గా  అభివృద్ధి చెందిందని మంత్రి హరీశ్‌ రావు  అన్నారు. సీఎం కేసీఆర్‌   నేతృత్వంలో హైదరాబాద్‌ గ్లోబల్ సిటీగా  ఎదిగిందని చెప్పారు. అదేవిధంగా ఆరోగ్య రంగంలో దూసుకుపోతున్నదని తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, ఆరోగ్యాన్ని మించిన సంపద లేదన్నారు. హైదరాబాద్‌ నలుమూలలా 10 వేల పడకల సూపర్ స్పెషాలిటీ పడకలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. నీతి అయోగ్ నివేదిక ప్రకారం దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానంలో ఉంది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన ఓ ప్రైవేటు దవాఖానను ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళితో కలిసి మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్‌లను గాంధీ, నిమ్స్‌ దవాఖానల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్పొరేట్ దవాఖానలతో తెలంగాణ ప్రభుత్వ హాస్పిటళ్లు పోటీ పడుతున్నాయని చెప్పారు.

2014లో ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు 30 శాతం ఉంటే, గత నెల 70 శాతం చేరాయని వెల్లడించారు. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్‌లో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నదని తెలిపారు. ఎనీమియా తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 14 నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు అందించనున్నామని చెప్పారు. మాతా శిశు మరణాలు తగ్గించడంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. డెలివరీలు వంద శాతం దవాఖానల్లో జరుగుతున్నాయని వెల్లడించారు. అనవసర సి-సెక్షన్లు తగ్గించడంలో ప్రైవేటు హాస్పిటళ్లు తోడ్పాటునందించాలన్నారు. నాడు పేదలు రొట్టెలు తింటే, ధనికులు అన్నం తిన్నారని, నేడు అది రివర్స్ అయ్యిందన్నారు.

తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన రాజమౌళి దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి.. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేశారన్నారు. బాహుబలితో తెలుగువారీ కీర్తి దేశ వ్యాప్తమైతే.. ఆర్‌ఆర్‌ఆర్‌తో ప్రపంచ వ్యాప్తం చేశారని తెలిపారు. ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానలో పేషెంట్ కేర్, సెక్యూరిటీ వంటి విషయాల్లో రెండేండ్లపాటు వ్యయాన్ని భరించేందుకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ముందుకు వచ్చారని చెప్పారు.

అంతకుముందు మాట్లాడిన దర్శకుకు రాజమౌళి.. మంత్రి హరీశ్ రావు పనితీరుపై ప్రశంసలు కురిపించారు. సిద్దిపేట నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తాను చూసిన నాటికి ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చిందన్నారు. అప్పటి నుంచే తాను మంత్రి హరీశ్‌కు అభిమానిగా మరానని చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat