ఆసీస్ తో WTC ఫైనల్లో కష్టాల్లో భారత్ ను శార్దూల్ 51 రన్స్ తో ఆదుకున్నారు. ఈ క్రమంలో ఓ రికార్డు సృష్టించారు. టెస్టుల్లో 8 లేదా అంతకంటే దిగువ స్థానంలో బ్యాటింగుకు దిగి 4 హాఫ్ సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో చేరారు.
కిరణ్ మోరే 21 ఇన్నింగ్సుల్లో 5 ఫిఫ్టీస్ చేయగా, శార్దూల్ 13 ఇన్నింగ్సుల్లోనే 4 ఫిఫ్టీస్ చేశారు. ఆ తర్వాత కపిల్ 4(22 ఇన్నింగ్సులు), హర్భజన్ 4(31 ఇన్నింగ్సులు) ఉన్నారు.