రేపటి నుంచి యథావిధిగా స్కూల్స్ ప్రారంభం అవుతున్నప్పటికీ ఒంటిపూట బడులు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది.
వడగాల్పులు, తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో జూన్ 17 వరకు ఉ.7.30 నుంచి మ. 11.30 వరకు తరగతులు నిర్వహిస్తామని ప్రకటించింది. ఉ.8.30-9 మధ్య రాగి జావ, ఉ.11.30-మ.12 మధ్య భోజనం పెడతారు.
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు ఈ నిబంధన వర్తించనుంది. జూన్ 19 నుంచి బడులు పూర్తిస్థాయిలో నడుస్తాయి.