అప్సరను హత్య చేసిన పూజారి సాయికృష్ణ నిన్న శంషాబాద్ పోలీస్ స్టేషన్లో హంగామా సృష్టించాడు. ‘నేను ఆత్మహత్య చేసుకుంటా. జైలుకు వెళ్లినా బతకను.
అప్సరను చంపే ఉద్దేశం నాకు లేదు. పెళ్లి చేసుకోమని టార్చర్ చేసింది. లేకపోతే ఫొటోలు వైరల్ చేస్తానని బెదిరించింది’ అని విలపిస్తూ పోలీసులతో చెప్పినట్లు తెలుస్తోంది. కాగా అతడికి రాజేంద్రనగర్ కోర్టు రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.