తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా డీకే అరుణకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి,మాజీ మంత్రి .. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ప్రచార కమిటీ ఛైర్మన్ పదవితోపాటు కీలక అధికారాలు అప్పగించాలన్న ప్రతిపాదనపై చర్చలు సాగుతున్నాయట. త్వరలోనే కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి