ఏపీ అధికార పార్టీ వైసీపీ నుండి సస్పెన్షన్ కు గురైన వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి హైదరాబాద్ లో నిన్న శుక్రవారం టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు.
దాదాపు గంటపాటు నెల్లూరు జిల్లా రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైఎస్సార్ జిల్లాలో కొనసాగుతున్న లోకేశ్ పాదయాత్ర నెల్లూరులో ప్రవేశించినప్పుడు టీడీపీలో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఆనం కుమారుడు రంగమయూరిరెడ్డి ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.