ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రజ్యోతి రూరల్ రిపోర్టర్, సూర్యాపేట రూరల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సాంబా చారిని శనివారం కాసరబాద్ గ్రామంలోని ఆయన నివాసంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట జడ్పిటిసి జీడి బిక్షం, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సంకరమద్ది రమణారెడ్డి, నాయకులు కొల్లు నరేష్, బంటు సైదులు, నాగరాజు, చందు తదితరులు ఉన్నారు
