తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్‌ను రూ.1000 పెంచుతూ గౌరవ సీఎం కేసీఆర్ గారు నిన్న ప్రకటించిన నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే శ్రీ కేపి వివేకానంద్ గారి కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.
ఇప్పటివరకు దివ్యాంగులకు రూ.3116/- పెన్షన్ ఇస్తుండగా, దానిని రూ.4116/-కు పెంచుతూ వచ్చే నెల నుంచే అమల్లోకి వస్తుందని గౌరవ సీఎం కేసీఆర్ గారు చెప్పిన నేపథ్యంలో దివ్యాంగుల ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా దివ్యాంగులు మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారన్నారు. సీఎం కేసీఆర్ గారు తమ పాలిట దేవుడని అన్నారు. ఇటీవల కాలంలో కన్న బిడ్డలే చూసుకొని ఈ తరుణంలో నెల నెల పెన్షన్ ఇస్తూ.. వెయ్యి రూపాయలు పెంచి మాకు పెద్ద కొడుకుల సీఎం కేసీఆర్ గారు అండగా నిలుస్తున్నారని వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కేఎం గౌరీష్, బొడ్డు వెంకటేశ్వర రావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తంగ లక్ష్మారెడ్డి, డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంకరయ్య, రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్, మాజీ అధ్యక్షుడు గౌసుద్దిన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సంపత్ మాధవ రెడ్డి, మహ్మద్ మక్సూద్ అలీ, గుమ్మడి మధుసుధన్ రాజు, కస్తూరి బాల్ రాజ్, సత్తిరెడ్డి, సమ్మయ్య, తెలంగాణ సాయి, బస్వరాజ్, శేఖర్ రావు, మూసాకాన్, ఇందిరా రెడ్డి, అరుణ, దిలీప్, కార్తిక్ గౌడ్, శ్రీశైలం యాదవ్, సతీష్ గట్టోజి, బాలునేత మరియు దివ్యాంగులు మల్లారెడ్డి, బీసు వెంకటేష్ గౌడ్, బ్రమరాంబ, రమ, ఉమ, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.