ఏపీ కి వరప్రదాయిని పోలవరం నిర్మాణంలో గతంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలోని టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలు, వారి పాపాలు ప్రాజెక్టును ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ప్రాజెక్టు పనుల్లో జాప్యానికి కారణమవుతున్నాయి. గత ఎన్నికల తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేశారు.
ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టారు. యుద్ధప్రాతిపదికన స్పిల్ వే పూర్తి చేసి, గేట్లు బిగించారు. ఈ చర్యల కారణంగా వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో గోదావరికి జూలై రెండో వారంలో రికార్డు స్థాయిలో భారీ వరద వచ్చినా, స్పిల్ వే ద్వారా సులభంగా దిగువకు విడుదల చేసారు.ఈ నీరు దిగువ కాఫర్ డ్యామ్ వద్ద 25 అడుగులకు చేరడంతో కోతకు గురైన ప్రాంతం మీదుగా ప్రవహించింది. దాంతో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ ప్రాంతం వరద నీటితో నిండిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగా ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ వద్ద అప్పట్లో ఏర్పడ్డ అగాధాలను పూడ్చే పనులకు ఆటంకం కలిగింది.
2019, 2020లలో వరదల ఉద్ధృతికి డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. టీడీపీ సర్కారు అవగాహన రాహిత్యం, కమీషన్ల కక్కుర్తి వల్ల గోదావరి వరదను మళ్లించే స్పిల్ వేను పూర్తి చేయకుండానే ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ పునాది డయాఫ్రమ్‌వాల్ నిర్మించేసింది
ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ ఎందుకు ఆలస్యం అవుతుంది?
(ప్రధాన డ్యామ్) దీన్ని మూడు విభాగాలుగా …
2474.5 మీటర్ల పొడవునా (గ్యాప్- 1లో 584.5 మీటర్లు,
గ్యాప్-2లో 1750 మీటర్లు, గ్యాప్ – 3లో140 మీటర్ల పొడవు)
45.72 మీటర్ల గరిష్ట నీటి మట్టంతో నిర్మించాలి.
దీన్ని నిర్మించాలంటే గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా అంటే.. అప్రోచ్ ఛానల్, స్పిల్ వే,స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్.. ఎగువ దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేశాక.. డ్యామ్‌కు పునాది అయిన డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి. దానిపై ప్రధాన డ్యామ్ పనులు చేపట్టాలి. కానీ.. చంద్రబాబు వరదను మళ్లించే పనులు పూర్తి చేయకుండా…
గ్యాప్ 2లో 1396 మీటర్ల పొడవునా డయా ఫ్రమ్ వాల్ నిర్మించే పనులను 2018 నాటికే పూర్తి చేశారు.2019 జూన్, జులైలో గోదావరికి భారీ వరదలు రావడంతో ఇది కొట్టుకుపోయింది.దీంతో..వేల కోట్లు నష్టపోవాల్సి వచ్చింది.
పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నాడు.