తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఈ వానాకాలం సీజన్ రైతుబంధు డబ్బులను వారం, పది రోజుల్లో రైతుల అకౌంట్లలో జమ చేసేందుకు వ్యవసాయశాఖ ప్లాన్ చేస్తోంది.
దాదాపు 65 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పున రూ.7400 కోట్లు అవసరం అవుతాయని అంచనా. మొదటి రోజు ఎకరంలోపు రైతులకు.. ఆ తర్వాత రోజు ఒక్కో ఎకరా పెంచుకుంటూ జూన్ ఆఖరు వరకు ఖాతాల్లో డిపాజిట్ చేయనున్నారు.