కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి ఇండస్ట్రియల్ నుండి దూలపల్లి ఎన్టీఆర్ విగ్రహం వరకు రూ.1.90 కోట్లతో నూతనంగా చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారితో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతీ ప్రాంతంలో మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో మిగిలి ఉన్న పనులన్నీ పూర్తి చేసి కొంపల్లి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లక్ష్మీ దేవేందర్, మున్సిపాలిటీ బిఆర్ఎస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు దేవేందర్, శివ మరియు ఇండస్ట్రియల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.