ఒడిశాలో జరిగిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో కొన్ని వందల మంది మృత్యువాత పడ్డారు. వేల మంది గాయాలపాలైన సంగతి తెల్సిందే. మరువక ముందే అదే రాష్ట్రంలో మరో రైలు బోగీలో మంటలు రావడం కలకలం రేపింది.
దుర్గ-పూరీ ఎక్స్ప్రెస్ ఏసీ బోగీలో ఖరియార్ రైల్వేస్టేషన్ సమీపంలో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు అప్రమత్తమై చైన్ లాగి రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ నుంచి పూరీకి వస్తుంది. తొలుత ఏసీ బోగీలో పొగలు రాగా.. తర్వాత బోగీ చక్రాల వద్ద మంటలు చెలరేగాయి