తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఈ రోజు ధర్మపురి ఎస్ హెచ్ గార్డెన్ లో నిర్వహించిన సాగునీటి దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ గారు,.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రం లో ఇరిగేషన్ రంగంలో వాస్తవంగా తెలంగాణ రాక పూర్వం ఈ ప్రాంతం యొక్క పరిస్థితి ఇంత దయనీయంగా ఉండెను మనందరి కూడా తెలుసు నేను ఆనాడు కూడా శాసనసభ్యులు గా ఉండి నిరంతరం చూసినటు వంటి వ్యక్తిగా అనేక అనుభవాలు ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా సాగునీరు లేక కరెంటు లేక వ్యవసాయం చేసే పరిస్థితి లేక అనేక మందికి భూములు జాగాలు ఉన్నప్పటికీ కూడా సకాలంలో నీళ్లు, కరెంట్ లేక వలసలు పోయిన పరిస్థితి, ఈ భూమి జాగలకు నమ్ముకుంటే బతుకడం కష్టం అని, ఇతర రాష్ట్రాల కు దేశాలకు బతుకు తెరువు కోసం పోదామని, ఒక్కొక్కరు ఊరు నుండి వందల కుటుంబాలు వలసలు పోయిన పరిస్థితిలో బలవంతంగా వ్యవసాయం చేసి పంట చేతికి రాక రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి, అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నాటువంటి పరిస్థితి నుండి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చూస్తున్నాం.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాకా, ఈ రోజు ఏ గ్రామానికి వెల్లి చూసిన చెరువులు నిండు కుండల నీళ్లు ఉండడం అనేది అద్భుతంగా చెప్పుకోవచ్చు, అందుకే ఒక పని జరిగిందంటే దానికదే జరుగదు, ఆకాశం నుండి ఊడిపడదు, ఒక విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి గా ఉంటేనే ఇలా జరుగుతుందని మంత్రి అన్నారు.65 సంవత్సరాల పాటు మనల్ని పరిపాలనటువంటి నాయకులు, ఏనాడు కూడా సాగునీరు రంగంలో ఒక మంచి ప్రయత్నం చేసి, తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి నీటి వనరులను రైతులకు అందించాలని గాని, ఇక్కడ ఉన్నటువంటి ఎడారి భూములకు సాగునీరు అందించి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఏనాడు ఆలోచించలేదు, మాటలు చెప్పిండ్రు తప్ప, పని జరగలేదు, కాని మన కెసిఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రంగంలో అనేక అద్భుతాలు జరుగుతాయని మంత్రి తెలిపారు
ధర్మారం మండలం పత్తిపాక, కొత్తపల్లి, బొమ్మిరెడ్డి పల్లె, మల్లాపూర్ కావచ్చు, అక్కడ కూడా నీళ్ల గురించి చాలా ఇబ్బంది పడ్డారు, వచ్చే అటువంటి కొద్ది సమయంలో ప్రాజెక్టులు పూర్తి చేసి, శాశ్వతంగా తరతరాలుగా నీళ్లు ఉండే అటువంటి పరిస్థితులని చేయబోతున్నాము.అందుకే ధర్మపురి నియోజకవర్గంలో 2014 పూర్వం తక్కువ ఆయకట్టు ఉండేది, సాగు లోకి రావాల్సిన భూమి 1లక్ష 32 వేల 886 ఎకరాలు ఉంటే ఇప్పటికే మనం దాదాపు 1 లక్ష 26 వేల ఎకరాలకు నీళ్లను అందిస్తున్నాము, ఇంకొక్క 3 వేల ఎకరాల కోసం పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు పూర్తి అయితే ఈ మిగిలిన ఎకరాలకు కూడా నీళ్లు ఇచ్చుకుంటాం, నూటికి నూరు శాతం అంటే ఒక రెండు శాతం మాత్రం అంటే 1259 ఎకరాలు మాత్రం వ్యవసాయానికి అనుకూలంగా రాని భూమి ఉంది, ఈ భూమిని వదిలేస్తే 92 శాతం మొత్తం భూమిని సాగులోకి తీసుకురా గలిగినం, ఇది మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఘనతే అని మంత్రి అన్నారు.అనంతరం సాగునీరు రంగంలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు మంత్రి శాలువా తో సత్కరించారు.ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్, మున్సిపాల్ చైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, జెడ్పీటీసీ లు, బాదినేని రాజేందర్, బత్తిని అరుణ, రైతు బంధు సమితి సభ్యులు సౌళ్ళ భీమయ్య వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యోరి రాజేష్, అడిషనల్ కలెక్టర్ లత, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు