తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో దుండిగల్ చెరువు వద్ద ఏర్పాటు చేసిన ‘సాగునీటి దినోత్సవ‘ వేడుకల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదటగా కట్ట మైసమ్మతల్లికి, గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాగునీటి విజయాలపై.. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఏవీని రైతులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే గారు వీక్షించారు. అనంతరం నీటి ప్రవాహం, మా తెలంగాణ కోటి ఎకరాల మాగణం పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు చెరువుల అభివృద్ధికి ఏనాడు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ ద్వారా చిన్న నీటివనరులైన చెరువులను పునరుద్దరించడం, పూడికతీత పనులను పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందన్నారు. చెరువు గ్రామ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వికాసానికి దోహదం చేస్తుందని, మిషన్ కాకతీయ ఆ దిశగా అడుగులు వేస్తున్నదని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం మనకు గర్వకారణమని, తెలంగాణలో అతి స్వల్ప కాలంలోనే అనేక అద్బుతాలు సృష్టిస్తున్న సీఎం కేసీఆర్ గారి నాయకత్వాన్ని దేశం అంతా చూస్తోందన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మొత్తం 91 చెరువులు ఉంటే.. అందులో మిషన్ కాకతీయ ఫేస్ -1లో 14 చెరువులు రూ.430.19 లక్షల ఖర్చుతో, మిషన్ కాకతీయ ఫేస్ – II లో 10 చెరువులు రూ.216.86 లక్షల ఖర్చుతో, మిషన్ కాకతీయ ఫేస్ – III లో 2 చెరువులు రూ.57.55 లక్షల ఖర్చుతో, మిషన్ కాకతీయ ఫేస్ – IV లో 3 చెరువులు రూ.52.94 లక్షలఖర్చుతో మొత్తం 29 చెరువులు రూ.757.54 లక్షల ఖర్చుతో మరమ్మతు పనులు గడిచిన తొమ్మిదేళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టడం జరిగిందన్నారు. అంతే కాకుండా ఫాక్స్ సాగర్, అంబీర్ చెరువులను రూ.67.85 కోట్ల ఖర్చుతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. జిహెచ్ఎంసి నిధులతో రూ.35.10 కోట్ల ఖర్చుతో చెరువుల నుండి మురుగు నీటి మళ్ళింపు, చెరువు కట్ట ఆధునీకరణ తూముల మరమ్మతు పనులు, ఫెన్సింగ్ మరియు సుందరీకరణ పనులు చేపట్టబడిందని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల నీటి నిలువ సామర్థ్యంతో పాటు గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగాయన్నారు.
2014కు ముందు సగటు భూగర్భజల మట్టము 17.60 మీటర్లు అయితే మిషన్ కాకతీయ చేపట్టిన తర్వాత కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో 11.32 మీటర్లకు పెరిగిందన్నారు. మిషన్ కాకతీయకు ముందు నియోజకవర్గ పరిధిలో చెరువుల నీటి నిల్వ సామర్థ్యం 286.12 Mcft ఉండగా మిషన్ కాకతీయ తర్వాత చెరువుల సామర్థ్యం 327.34 Mcft లు పెరిగిందన్నారు. దీని ద్వారా చెరువులలో చేపల సామర్ధ్యము గణనీయంగా పెరిగిందన్నారు. 2014 ముందు నియోజకవర్గ పరిధిలో ఆయకట్టు 1824 ఎకరాలు ఉంటే ప్రస్తుతం ఆయకట్టు 2073 ఎకరాలకు పెరిగిందన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే గత ప్రభుత్వాల కంటే బీఆర్ఎస్ హయాంలో అధ్బుతమైన విజయాలు సాధించామన్నారు.
త్వరలోనే ఫాక్స్ సాగర్, అంబీర్ చెరువులను మినీ ట్యాంక్ బండ్ లుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ బన్సీలాల్, డిఈఈ సురేష్, ఏఈ సార, మున్సిపాలిటీ కమిషనర్ సత్యనారాయణ, ఎమ్మార్వో పద్మప్రియ, డిప్యూటీ ఎమ్మార్వో సుధాకర్ మరియు మాజీ జెడ్పీవైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రవీందర్ యాదవ్, కౌన్సిలర్లు జక్కుల కృష్ణాయాదవ్, గోపాల్ రెడ్డి, డి.ఆనంద్ కుమార్, మాజీ సర్పంచ్ కావలి గణేష్, కార్పొరేటర్లు విజయ లక్ష్మి, బాలాజీ నాయక్, పాక్స్ వైస్ చైర్మన్ నల్తూరి కృష్ణ, డైరెక్టర్ ఈ. శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ యాదయ్య, సీనియర్ నాయకులు జే.శ్రీనివాస్, బండారి మహేష్, ఉప్పరి కృష్ణ, పాండు గౌడ్, వీరమల్లు, కుంటి వెంకటేష్, జగన్ నాయక్, వీరస్వామి, పిట్ల నర్సింహా తదితరులు పాల్గొన్నారు.