Home / SLIDER / బిఆర్ఎస్ పార్టీలోకి మధ్యప్రదేశ్ నుండి భారీ చేరికలు

బిఆర్ఎస్ పార్టీలోకి మధ్యప్రదేశ్ నుండి భారీ చేరికలు

బిఆర్ఎస్ పార్టీలోకి మధ్యప్రదేశ్ నుండి చేరికలు కొనసాగుతున్నాయి. ఈ దిశగా నేడు కీలక పరిణామం చోటు చేసుకున్నది. మధ్యప్రదేశ్ కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, మధ్యప్రదేశ్ లో సంచలనం రేపిన వ్యాపమ్ స్కామ్ ను వెలుగులోకి తెచ్చిన ఆనంద్ రాయ్ బుధవారం ప్రగతిభవన్ లో బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ అధినేత కేసీఆర్ వీరిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆంనద్ రాయ్ ఆర్టిఐ, ట్రైబల్ రైట్స్ యాక్టివిస్టుగా ప్రజల ఆదరాభిమానాలు పొందారు. సామాజిక కార్యకర్తగా వీరికి ప్రజల్లో మంచి పట్టు ఉన్నది.

మధ్యప్రదేశ్ లో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న “జై ఆదివాసి యువశక్తి సంఘటన్ (JAYS)” అనే ప్రముఖ గిరిజన హక్కుల వేదిక బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది మధ్యప్రదేశ్ లో ఆదివాసి, గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న ప్రముఖ సంస్థ. ఆనంద్ రాయ్ ఈ సంస్థలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు JAYS ప్రస్తుత అధ్యక్షుడు లాల్ సింగ్ బర్మన్, పంచం భీల్, అశ్విన్ దూబె, గాజీరామ్ బడోలే, కైలాశ్ రాణా తదితరులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

బిఆర్ఎస్ కు జెఎవైఎస్(JAYS) సంపూర్ణ మద్దతు

తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి పాలనలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మానవీయ కోణంతో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల అభివృద్దే ధ్యేయంగా కొనసాగుతున్నాయని జెఎవైఎస్ ఫౌండర్ విక్రమ్ అచ్చాలియా తెలిపారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్న బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కు తమ జై ఆదివాసి యువశక్తి సంఘటన్ (జెఎవైఎస్) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని తెలిపారు. 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో పేదలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, ఆదివాసీల ఆకాంక్షలు నెరవేరలేదని, బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నారనే విశ్వాసం దేశవ్యాప్తంగా కలుగుతున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశ ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా బిఆర్ఎస్ ఎదుగుతున్నదని అన్నారు. బిఆర్ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా జాయ్స్ జాతీయ అధ్యక్షుడు లోకేష్ ముజాల్దా, వుమన్ ఇంచార్జ్ సీమా వాస్కాలె, మధ్యప్రదేశ్ అధ్యక్షుడు రాందేవ్ కకోడియా ఉన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat