తమకు న్యాయం చేయాలని నిరసన తెలుపుతున్న రెజ్లర్లతో చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సమస్యలపై చర్చించేందుకు మరోసారి వారిని ఆహ్వానించినట్లు ట్వీట్ చేశారు.
అయితే రెండు రోజుల క్రితమే రెజ్లర్లు కేంద్రమంత్రి అమిత్ షాతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనురాగ్ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది