కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బాచుపల్లి అరబిందో ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద బాధితులను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు బాచుపల్లి ఎస్ఎల్ జీ ఆసుపత్రిలో పరామర్శించారు. 7 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుడగా మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే గారు డాక్టర్లకు సూచించారు.
అదే విధంగా 17వ డివిజన్ కౌసల్య కాలనీలో నివాసం ఉంటున్న రాజేష్ అనే వ్యక్తి కుమారుడు లోహిత్ (11) ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుండి కింద పడగా గాయాలయ్యాయి. చికిత్స పొందుతున్న లోహిత్ ను ఎమ్మెల్యే గారు పరామర్శించారు.
త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్, సీఐ సుమన్, స్థానిక కార్పొరేటర్ ఆగం రాజు ముదిరాజ్, ఎన్ఎంసీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, సీనియర్ నాయకులు బూరుగుబావి హనుమంత రావు, కొలన్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.