తాను క్యాన్సర్ బారిన పడ్డానని శనివారం మీడియాలో ప్రసారమైన వార్తల్ని ఖండించారు అగ్ర నటుడు చిరంజీవి. శనివారం హైదరాబాద్ నానక్‌రామ్‌గూడాలోని స్టార్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసి క్యాన్సర్ విభాగాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి గతంలో తాను చేయించుకున్న ముందస్తు పరీక్షల వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం నుంచి తప్పించుకున్నానని తెలిపారు.
అయితే చిరంజీవి మాటల్లోని మెడికల్ పరిభాషను సరిగ్గా అర్థం చేసుకోకపోవడంతో ఆయన క్యాన్సర్ బారిన పడి కోలుకున్నారని వివిధ మాధ్యమాల్లో వార్తలు ప్రసారమయ్యాయి.