‘భానుమతి..సింగిల్‌పీస్..హైబ్రీడ్ పిల్ల’ అంటూ తెలుగు చిత్రసీమలో అరంగేట్రంతోనే యువత హృదయాల్ని గెలుచుకుంది సాయిపల్లవి. అనతికాలంలోనే అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఎదిగింది. వైవిధ్యమైన కథాంశాల్ని ఎంపికచేసుకుంటూ తనదైన అద్భుతాభినయం, అసాధారణ నృత్యప్రతిభతో తిరుగులేని గుర్తింపును సంపాదించుకుంది.
ఈ తమిళ సోయగం ‘ప్రేమమ్’ చిత్రం ద్వారా కథానాయికగా వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే. అందులో మలర్‌గా ఆమె పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమా విడుదలై ఎనిమిదేండ్లు పూర్తయ్యాయి.ఈ సందర్భంగా సోషల్‌మీడియలో ‘ప్రేమమ్’ హ్యాష్‌టాగ్‌ను ఆమె అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.
ఎనిమిదేండ్ల కెరీర్లో ఆమె పోషించిన అద్భుతమైన పాత్రలు, సాధించిన విజయాల గురించి చర్చించుకుంటున్నారు. అయితే గత రెండేళ్లుగా సాయిపల్లవికి తెలుగులో ఆశించిన విజయాలు రాలేదు. లవ్‌స్టోరీ, శ్యామ్‌సింగరాయ్, విరాటపర్వం చిత్రాలు మెప్పించలేకపోయాయి. గత ఏడాది కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్నది సాయిపల్లవి. తెలుగులో గ్యాప్ రాలేదని, తానే తీసుకున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది సాయిపల్లవి. ప్రస్తుతం ఆమె శివ కార్తికేయన్ సరసన ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నది.