అశ్వారావుపేట మండలంలో నిన్న ఒక్కసారిగా వచ్చిన గాలివాన బీబాత్సానికి మళ్ళాయిగూడెం(గ్రామం)లో ఇళ్ళపై చెట్లు విరిగి పడటం,ఇళ్ళపై ఉన్న రేకులు ఎగిరిపోవడం,చెట్లు విరిగి పడి కరెంట్ స్థంబాలు నెలకొరగడం,బారెన్ పూర్తిగా కూలిపోవడం అక్కడ ఉన్న వారికి గాయాలు అవ్వడంతో విషయం తెలుసుకున్న అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు గారు ఈరోజు గ్రామంలో విస్తృతంగా పర్యటించి పరిశీలించారు…
నష్టపోయిన వారిని పరామర్శించి ప్రభుత్వం తరుపున నష్ట పరిహారం అందేవిధంగా చూస్తానని అక్కడే ఉన్న MRO గారితో నష్టం జరిగిన వాటిని అంచనా వేసి ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు..బారేన్ వద్ద గాయాలు అయిన ఇద్దరినీ ఇంటికి వెళ్లి పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించి కర్చిల నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు.
అక్కడ ఉన్న గ్రామస్థులు ఇల్లు కావాలని కోరడంతో MLA గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో గృహలక్ష్మి పథకం ద్వారా 3లక్షలు ఇస్తుందని అర్హులందరికీ వచ్చేలా చేస్తానని,తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎంతో అభివృద్ది జరిగిందనీ..ఈరోజు మనం మన అశ్వారావుపేట నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ది చేసుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు అండగా ఉన్నారని,పోడు భూమి పట్టాలు కూడా వచ్చేశాయని త్వరలో పంపిణీ చేయడం జరుగుతుందని పోడు పట్ట మాత్రమే కాడుకుండ పోడు భూమి ఉన్న వారికి రైతు బందు కూడా వచ్చే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేశారని గ్రామస్థులకు తెలిపారు. మళ్ళాయిగూడెం – అనంతారం వెళ్ళే మార్గం BT రోడ్డు కావాలనీ కోరడం తో వెనటనే ITDA AE ప్రసాద్ గారికి ఫోన్ చేసి అంచనా వేసీ ఇవ్వాలని ఆదేశించారు తద్వారా మంత్రి గారితో మరియు PO గారితో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానన్నారు…. అలాగే మంచి నీరు త్వరగా అందించాలని కరెంట్ కూడా త్వరగా అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు…. కష్టంలో ఉన్న ఎవరు రాలేదని అలాంటిది MLA గారు గ్రామానికి రావడం సమస్యలు తెలుసుకోవడం మరియు నమ్మకం కల్గించడంతో గ్రామస్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు