ఐనవోలు మండల రైతు బందు సమితి కోఆర్డినేటర్ గా మునిగాల సంపత్ కుమార్ గారిని ఎంపిక చేస్తూ వ్యవసాయ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ఐనవోలు మండల కేంద్రంలో డిసిసిబి చైర్మన్ మార్నెని రవీందర్ రావు గారితో కలిసి మునిగాల సంపత్ కుమార్ గారికి నియామక పత్రాన్ని అందజేసి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పోలేపల్లి శంకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బుర్ర రాజశేఖర్, ఐనవోలు సర్పంచ్ జన్ను కుమారస్వామి, సింగారపు రాజు, బైరి వెంకటయ్య, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
