తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు 2014 -2023 సందర్బంగా జూన్ 2 వ తేదీ నుండి 22 వరకు జరిగే ఉత్సవాల పైన ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు .
ఇట్టి సమావేశంలో నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, సీపీ ఏవి రంగనాథ్, హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్,వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య,జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, శాసనసభ్యులు ఆరూరి రమేష్, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మా రెడ్డి, డాక్టర్ టి. రాజయ్య,ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ,అదనపు కలెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దశాబ్ది ఉత్సవాలపై సమీక్షించారు.. ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు….