తెలంగాణ వైతాళికులు, గోల్కొండ పత్రిక మాజీ సంపాదకులు సురవరం ప్రతాప్ రెడ్డి గారి 127 వ జయంతి సందర్భంగా రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గార్లు హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రాంతానికి చెందిన వైతాళికులు, కవులు, సాహితివేత్తలు, కళాకారులు, సామాజిక వేత్తలను గుర్తించి వారి జయంతి వర్ధంతిలను అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు.
వారు అందించిన సేవలను భవిష్యత్తు తరాలకు తెలియచెప్పేలా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తుందని మంత్రులు ఈ సందర్భంగా వెల్లడించారు.
తెలంగాణ వైతాళికులు, సాహితీవేత్త, గోల్కొండ పత్రిక మాజీ సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి గారు అందించిన సేవలను ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో సురవరం ప్రతాపరెడ్డి గారి కుటుంబ సభ్యులు తెలంగాణ సాహిత్య పరిషత్ ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.