సామాజిక సేవలో వాసవి క్లబ్ సేవలు అభినందనీయమని కోదాడ అభివృద్ధి ప్రధాత,శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని నయా నగర్ లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సిమెంట్ బెంచ్ ల పంపిణీలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. స్వచ్ఛంద సంస్థలు సామాజిక సేవలో ముందుండాలన్నారు.
స్వచ్ఛంద సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం తగిన గుర్తింపుని ఇస్తుందన్నారు. వాసవి క్లబ్ సామాజిక సేవలు విస్తృతపరచాలన్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అనే నాడుని ని స్వచ్ఛంద సంస్థలు లక్ష్యంగా తీసుకోవాలన్నారు. వీధుల్లో పలు కూడళ్లలో సిమెంట్ బెంచీ ల ఏర్పాటు వృద్ధులు, వికలాంగులు గర్భిణీలు కొంతసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఎంతో దోహదపడుతుందన్నారు.
వాసవి క్లబ్ కార్యక్రమాలలో తన వంతు సహకారం అని వేళలా ఉంటుందన్నారు కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు ఇమ్మడిసతీష్ బాబు, ప్రధాన కార్యదర్శి ఎస్ శ్రీనివాస్ రావు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సత్యబాబు, టౌన్ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, కౌన్సిలర్లు డాక్టర్ బ్రహ్మం, ఒంటిపులి శ్రీనివాస్, బిఆర్ఎస్ నాయకులు రాయపూడి వెంకటనారాయణ, కోశాధికారి వెంపటి ప్రసాద్, జగిని ప్రసాద్, జిల్లా ఇంచార్జి ఎర్ర శ్రీనివాస్ రావు, పబ్బ గీత , క్లబ్ నాయకులు చల్ల విజయ్ శేఖర్, పందిరి సత్యనారాయణ, కోటేశ్వరరావు,ఇమ్మడి సంధ్యారాణి, యధారాణి, తదితరులు పాల్గొన్నారు.