కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ బాచుపల్లి రాజీవ్ గాంధీనగర్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా 69వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా రూ.2.72 కోట్లతో చేపట్టిన వివిధ పనులకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేశారు. మొదటగా 15వ డివిజన్ రాజీవ్ గాంధీనగర్ లో రూ.17 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, చిల్డ్రన్ పార్క్ ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ గారు, కమిషనర్ రామకృష్ణ రావు గారు, స్థానిక కార్పొరేటర్ సుజాత గారితో కలిసి ప్రారంభించారు.
అనంతరం 16వ డివిజన్ రాజీవ్ గాంధీనగర్ లో రూ.95 లక్షలతో పూర్తి చేసిన ఇంటింటికీ మంచినీటి కనక్షన్, డిఐ పైప్ లైన్ ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు స్థానిక మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్, ఫ్లోర్ లీడర్ & కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ గారితో కలిసి ప్రారంభించారు. రూ.80 లక్షలతో సీసీ రోడ్డు, రూ.80 లక్షలతో భూగర్భడ్రైనేజీ నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చే దిశగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.
గౌరవ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి సహకారంతో అభివృద్ధి పనులకు ఎన్ని కోట్ల నిధులైన వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో నిజాంపేట్ ను మోడల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంసి బిఆర్ఎస్ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ మరియు కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.