కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇండ్లు కోల్పోయిన ఏడుగురు బాధిత కుటుంబాలకు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారాన్ని మంజూరు చేయించి చింతల్ లోని తన కార్యాలయం వద్ద రూ.53,40,316/- విలువ చేసే చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గతంలో ఇండ్లు కోల్పోయిన 48 బాధిత కుటుంబాలకు పరిహారం అందజేయడం జరిగిందన్నారు. పెండింగ్ లో ఉన్న బాధిత కుటుంబాలకు కూడా త్వరలోనే అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ ప్రభావతి, టీపీఎస్ వికాస్, న్యాక్ ఇంజనీర్ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.