తాను ఎంపీగా పోటీ చేస్తాననే వార్తలు అసత్యమని వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు.
టీడీపీ అధినేత ..మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తాను ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని చెప్పారు.
మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది చివర్లోనే ఎన్నికలు ఉండవచ్చు. అప్పటికి 60 శాతం మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరుతారు. నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాలను కైవసం చేసుకుంటాం’ అని ఆయన పేర్కొన్నారు.