సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ .. స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా.. సునీల్,అనసూయ,రావు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించగా పాన్ ఇండియా మూవీగా విడుదలై ఘన విజయం సాధించిన మూవీ పుష్ప.
ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప-2 తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. అయితే పుష్ప -2 సినిమాలో బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. రణ్ వీర్ ఓ గెస్ట్ రోల్లో కనిపించనున్నాడట. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.