తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం పటిష్టతకే కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు గారు అన్నారు. పెరిగిన దవాఖానలకు అనుగుణంగా నియామకాలు జరుపుతున్నామని చెప్పారు.
ఒకేరోజు 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించామని, వైద్య విద్యలో దేశంలోనే ఇది ఒక రికార్డని చెప్పారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో కొత్తగా నియమితులైన 1061 మంది అసిస్టెంట్ ఫ్రొఫెసర్లకు నియామక పత్రాలను మంత్రి హరీశ్ రావు గారు అందజేశారు.
అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టామన్నారు. 1331 మంది ఆయుష్ కాంట్రాక్ట్ సిబ్బందిని క్రమబద్ధీకరించామని తెలిపారు.