తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతువేదికలను నిర్మించింది.
ఈ రైతు వేదికల్లో రైతులకు సంబంధించిన సమావేశాలే కాకుండా, ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమావేశాలు కూడా పెట్టుకునేలా వీలుకల్పిస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ పథకాల గురించి లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు రైతు వేదికలనే కేంద్రంగా చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ తెలిపింది. అయితే ప్రైవేటు కార్యక్రమాలకు ఇస్తే, ఆదాయ కేంద్రాలుగా మారుతాయని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.